యండమూరి వీరేంద్రనాథ్ ..చిన్న కథలు..2

యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా 36 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో విజయానికి ఆరోమెట్టుపుస్తకం ఒక మైలురాయి. అందులోని చిన్న కథలే ఇవి. మానవ జీవితంలో ప్రతీ అంశాన్ని టచ్ చేస్తూ వచ్చారు యండమూరి. గీతను మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం లేదు అంటూ, సందేశం ఒకవైపు ఆశక్తి కొలిపే కథలూ - విశ్లేషణలూ బోనస్ గా ఒకవైపు వివరణలు ఇస్తూ, సరికొత్త ప్రయోగాన్ని చేయడం అపూర్వం. అందులోని కథలే యండమూరి చిన్ని కథలూ... మరికొన్ని ...

 

సింప్లిసిటీ ....


మనం రోడ్డు మీద నడుస్తుంటేనో రైలులో ప్రయాణం చేస్తుంటేనో చాలామంది వ్యక్తులు ఎదురు పడుతూ ఉంటారు. వారిలో ఎందఱో వేదావులు, ప్రొఫెసర్లు, నోబెల్ ప్రైజ్ విన్నర్లు కూడా ఉండి ఉండవచ్చు. వారి యొక్క వేష భాషలను బట్టి అంతస్థు అంచనా వేయటం కష్టం. అలాగే వారి తెలివితేటలను ధనాన్ని, దానగుణాన్ని, మంచితనాన్ని కూడా. ముఖ్యంగా రైళ్ళలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎదుటి వారి వివరాలు అడగకపోవటం వలన, వారి నుంచి జ్ఞానాన్ని పాడే అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం.'హస్కు' కొట్టడం వేరు, జ్ఞానం పొందడం వేరు.

1884 లో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే స్టాన్ ఫోర్డ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. అతడి తల్లిదండ్రులు చాలా విషాదగ్రస్తులై కొడుకు జ్ఞాపకార్ధం ఏదైనా స్థూపం కానీ , మీటింగ్ హాలు కానీ నిర్మించాలను కొన్నారు.దాని నిమిత్తం వారు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ చార్లెస్ ఎలియార్డ్ ని  కలుసుకున్నారు. ఆ దంపతులు చాలా సాదా సీదాగా, అణుకువగా సామాన్య దుస్తుల్లో ఉన్నారు.
చాలా  సేపు బయట వేచివున్న తరువాత వారికి లోపలికి వెళ్ళటానికి అనుమతి దొరికింది. తన దగ్గరకు వచ్చింది మరణించిన విద్యార్థి తాలూకు తల్లిదండ్రులనీ, తమకొడుకు పేరుమీద వారు  యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక గది నిర్మాణానికి వచ్చారనీ తెలిసి చార్లెస్ కాస్త సందేహంతో "మీరు ఒక గది నిర్మించాలంటే దానికి చాలా ఖర్చవుతుంది. పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోకండి" అని సలహా ఇచ్చాడు.
అప్పుడు వృద్ధురాలైన ఆ కుర్రవాడి తల్లి ఎలియార్డ్ తో " ఈ యూనివర్సిటీ కట్టటానికి ఎంత ఖర్చయి ఉంటుంది సర్" అని అమాయకంగా అడిగింది. ఎలియార్డ్ కాస్త గర్వంగా "దాదాపు 10 మిలియన్ల డాలర్లు" అని చెప్పాడు. అపుడు ఆ ముసలి దంపతులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కళ్ళతోనే ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు.
ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఆ యువకుడి తండ్రి ఎలియార్డ్ వైపు కు తిరిగి "అయితే మా కొడుకు పేరు మీద ఒక  యూనివర్సిటీయే కట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము సర్"అన్నాడు నమ్రతగా.
26 మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఆ విధంగా స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ స్థాపించబడింది.

కల్లు తగిన కోతి

ఒక బందిపోటు దొంగ బాగా తాగేసి, ఆ అర్ధరాత్రి పూట ఓ పెట్రోల్ బంక్ లోకి ప్రవేశించాడు, పిస్తోల్ తీసి మేనేజర్ ని బెదిరిస్తూ, క్యాష్  బాక్స్ లో ఉన్న డబ్బంతా ఇమ్మన్నాడు. మేనేజర్ నిరాకరించేసరికి, ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. "మరీ గొడవ చేస్తే ఫోన్ చేసి పోలీసుల్ని పిలుస్తాను" అన్నాడు దొంగ.అలాగే పిల్చాడు కూడా. పోలీసులు వచ్చి ఫోన్ చేసిన దొంగని అరెస్ట్ చేసారు.
ఇంటరాగేషన్ లో ఎందుకిలా చేసావని అడిగితే " నా పిస్టల్ లో గుళ్ళు లేవుమరి" అన్నాడు మత్తుదిగిపోయిన తరువాత.
నమ్మశక్యం కానీ ఈ సంఘటన అమెరికాలోని మిచిగాన్ లో దాదాపు మూడు సంవత్సరాల  క్రితం జరిగింది.పూర్తిగా ఆల్కహాల్ సేవించినపుడు మనుఘులు ఎలా ప్రవర్తిస్తారన్నది కాదు ఈ కథలోని నీతి.
తాము చేసిన తెలివితక్కువ పనులని మనుషులు ఎలా సమర్ధించుకుంటారో ఉదాహరణకి చెప్పడమేనని ప్రసిద్ద మానసిక శాస్త్రవేత్త రాబర్ట్ స్కల్లర్  ఒక చోట రాస్తాడు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!