మంచుపూల వర్షం....యండమూరి వీరేంద్రనాథ్

యండమూరి వీరేంద్రనాథ్ రచనల్లోనుంచి ఏరికూర్చిన సుభాషిత సంపుటం "మంచుపూల వర్షం" నుండి పాఠకుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ రేటింగ్ ఇవ్వబడిన సుభాషితాలు..పార్ట్-1


మైండ్ పవర్ : నంబర్ వన్ అవడం ఎలా?

1.ప్రతీ గమ్యాన్ని చేరుకోవడంలోనూ, "నేను కష్టపడుతున్నాను"  అన్న ఫీలింగ్ ఉన్నవాడు జీవితంలో ఎప్పుడూ నెంబర్ వన్ కాలేడు.
2.ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు. మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది 'కష్టం'గా మారుతుందంతే.
3.మరొకరు హీరోగా నటించే చిత్రంలో సైడ్ కారెక్టర్ కాదు. మీ జీవిత చిత్రంలో మీరే హీరో.
4.మనిషి ధ్యేయం ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కొందరు మాత్రమే అక్కడకు చేరుకుంటారు.. అడుగువేసి అలసిపోని వాళ్ళు!!!
5.నీకు హాని చేసేది "బలహీనత" , నీ వల్ల ఇతరులకి హాని జరిగితే అది "తప్పు". నీకు గాని ఇతరులకి గాని హాని జరగని పని. నీ సంతృప్తి కోసం నువ్వేది చేసినా పర్వాలేదు.
6.తన గురించి 'మెదడు'తో ఆలోచించి. ఇతరుల గురించి 'మనసు' తో ఆలోచించగలిగిన వాడే  నెం.1 కాగలడు.
7.నిన్నటి ఓటమి గురించి చింతని, రేపటి సాయంత్రంపు దిగులుగా మారనివ్వకు, ఈ రోజుని అనుభవించు.
8.నెం.1 అవడమంటే అమితమైన ధనమూ, అంతులేని అధికారమూ సంపాదించటం కాదు. కీర్తి, అధికారం, మానవ సంబంధాలు అనే అయిదు అంశాల్ని సంపాదించటానికి '...తృప్తి' నీ ఖర్చుపెడుతూ ఉంటాడు సామాన్యుడు. తృప్తిని స్టాండర్డ్ గా పెట్టుకుని, దాన్ని పెంచుకోవటానికి డబ్బు, కీర్తి, అధికారం, ప్రేమ మానవసంబంధాలని ఆధారం చేసుకుంటారు నెం.1 అదే తేడా.

విజయానికి ఆరోమెట్టు...

1."గెలుపువద్దనుకునే వాడికి, గెలిచి వద్దనుకునేవాడికి "తేడా మోక్ష  సన్యాసం"
2.ఎక్కడైతే 'స్వార్ధం' లేదో అక్కడ 'నష్టం' లేదు.
3.భయపడకుండా ఎదిరించడం ధైర్యం. భయపడవలసిన దానికి భయపడడం వివేకం.
4.ఇంతకన్నా మంచిగా ఎలా బ్రతకొచ్చో నిరంతరం తెలుసుకుంటూ ఉండటమే జీవితం.
5.సమయాన్ని తన చేతిలో ఉంచుకోగలగడం, తన కిష్టమైన పని మాత్రమే చేసే స్థితిని సంపాదించడం. ఈ ప్రపంచంలో మనిషికి ఆర్ధికపరమైన నిజమైన సంపద.
6.దేనికోసం ఏది వదిలేయ్యాలో తెలుసుకోవటమే జ్ఞానం.
7.జ్ఞానం పెరిగేకొద్దీ ''బంధం" తగ్గిపోతుంది. ఆ విధంగా దుఖం కూడా తగ్గిపోతుంది.
8.నీ మీద నీడ పడుతోంది అంటే ఎక్కడో వెలుగు ఉన్నదనేగా అర్ధం.
9.నిరాశావాది, గులాబికి క్రింద ముళ్ళు ఉన్నందుకు విచారిస్తాడు. పైన లేనందుకు ఆశావాది       ఆనందిస్తాడు.
10.మనిషి 'టీ బ్యాగ్' లాంటివాడు. అతడెంత స్ట్రోంగ్ తెలుసుకోవాలంటే కష్టం అనే వేడి వేడి నీళ్ళల్లో ముంచాలి.
11.జ్ఞానం అంటే ఏమిటి? ఈ రోజు హాయిగా బ్రతుకుతూ....రేపు అంతకన్నా బాగా బ్రతకటం ఎలాగో తెలుసుకోవటం.

తప్పు చేద్దాం రండి....!

1.ఈ ప్రపంచంలో అందర్నీ సంతోష పెట్టానుకునే వాడు తాను సుఖంగా ఉండలేదు. తన వారిని సుఖపెట్టలేడు.
2.గెలుపంటే మంచి పేకముక్కలు పడటం కాదు. పడిన ముక్కలతో సరిగ్గా ఆడగల్గటం! ఆడటం నీ చేతిలో ఉంది. ముక్కలిచ్చిన భగవంతుడి చేతిలో కాదు!! ఆడించేది కూడా భగవంతుడే అని నమ్మినవాడిని భగవంతుడు కూడా బాగుచెయ్యలేడు.
3.చిత్రమేమిటంటే ప్రతివారూ అవతలి వారు మారాలని కోరుకుంటారే తప్ప అది అసాధ్యమని గుర్తించారు. ఒక సమస్య వచ్చినప్పుడు నీకిష్టమయిన, నీకు సులభమైన పరిష్కారం కావాలంటే ఎలా? నువ్వు మారటం కష్టమయినప్పుడు, అవతలి వారు ఎందుకు మారుతారు? కష్టం నీది!నువ్వు మారాలి!అవతలి వారు సుఖంగా ఉన్నారు! కనీసం అలా అనుకుంటున్నారు! అప్పుడు వారు ఎందుకు మారతారు.
4.నీ అభిరుచులకి అనుగుణంగా గమ్యం ఏర్పరచుకోకు. నీ గమ్యానికి అనుగుణంగా అభిరుచులు ఏర్పరచుకో.
5.ఒక స్త్రీ అందంగా ఉంది కాబట్టి ప్రేమించొద్దు. నువ్వు ప్రేమించావు కాబట్టి ఆమె అందంగా ఉండాలి.
6.గొప్ప విజయం కోసం చిన్న విజయాన్ని త్యాగం చెయ్యటమే 'పవర్' .
7.నిన్నేవడైనా తప్పు పట్టాడంటే, నువ్వు తప్పు చేస్తున్నావని కాదు. నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్న మాట.
8.ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు. గెలిచేవాడు తొంభైతోమ్మిదిసార్లు ఓడిపోతాడు. వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి.
9.గమ్యం తరువాత గమ్యం పెట్టుకోవడమే జీవిత గమ్యం.
10.బద్ధకం ఆకర్షణీయమైనదే. కానీ పని తృప్తికరమైనది!
11.నువ్వు ఎల్లప్పుడు చాలా సెంటిమెంటల్ గా, కాస్త సిగ్గుగా, మంచిగా, మర్యాదగా, మొహమాటంతో ఉండాలని నీ చుట్టూ ఉన్నవారంతా ఆశిస్తారు. నిన్ను చాలా ఓపెన్ మైండ్ తో ఉండమని సలహా ఇస్తారు. అలా ఓపెన్ గా ఉన్నప్పుడు ఆ dustbin లో తమ చెత్తంతా వేయడం కోసం.
12.నువ్వు మంచిగా బ్రతుకుతూ, ఎవరికీ హాని తలపెట్టకుండా ఉంటే నీకు శత్రువులు ఉండరని అనుకోవద్దు. నీ తప్పు ఏమి లేకపోతే నీకు కష్టాలు రావని  బ్రమించవద్దు. నీవు ఏ తప్పు చేయకపోతే శిక్షపడదని భావించవద్దు. ఈ ప్రపంచంలో ఏ మనషికయినా  వచ్చే కష్టాల్లో సగం పైగా కష్టాలు. అతడి తప్పేమి లేకుండా వచ్చేవే.
13.నువ్వు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నిన్ను అవుట్ చేసేది నీ ప్రత్యర్థి కాదు. నీలోని టెన్షన్. నువ్వు ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు నీ గోల్ లోకి బంతి కొట్టేది అవతలిజట్టు ఆటగాడు కాదు. నీ అలసత్వం. నీవు హై జంప్ చేస్తున్నప్పుడు అడ్డుగా ఉండేది రాడ్ కాదు. నీలోని పిరికితనం.
14.నోటి చాపల్యంతో చేప గేలానికి ఇరుక్కున్నట్టు, చెవుల చాపల్యంతో పాము నాదస్వరానికి లొంగిపోయినట్టు. కంటి చాపల్యంతో పురుగులు మంటలో పడినట్టు. మనసు చాపల్యంతో తానూ కష్టాలకు గురి అవుతున్నానని తెలుసుకోవటమే జ్ఞానం.
15.ఒక ఆలోచన రాగానే ఆగిపోతే, మరో మంచి ఆలోచన మిస్ అవ్వొచ్చు. ఒక మంచి ఆలోచన రాగానే ఆగిపోతే, ఒక అద్బుతమైన ఆలోచన మిస్ అవ్వొచ్చు. ఒక అద్బుతమైన ఆలోచన దగ్గిర ఆగితే. ఒక సరి అయినా ఆలోచన మిస్ అవ్వొచ్చు.
16.మనిషి ఎలా సంతృప్తిగా బ్రతకాలో చెప్పేదారిలో, ఒక మైలురాయి లాంటి వాడు భగవంతుడు. కర్తవ్య నిర్వహణ మానేసి కేవలం అతన్ని పూజించేవాడు. ప్రయాణం మానేసి 'మైలురాయి'నీ పూజిస్తున్న వాడి క్రింద లెక్క.
17.జీవితం అనే వాహనం ఎక్కి కర్తవ్యం దారిలో ప్రయాణం ప్రారంభించు. యవ్వనం అనే పల్లం వస్తుంది. బ్రేకులు వెయ్యకపోతే పశ్చాత్తాపం అనే చెట్టుకు గుద్దుకుంటావు. వ్యసనం అని ఎడమవైపు బోర్డు కనపడుతుంది. అటు వెళ్తే ఊబిలో వాహనం ఇరుక్కుపోతుంది. తిన్నగావస్తే సమస్యల గతుకుల రోడ్డు వస్తుంది. బంధం అనే అడవిలోంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లోభం అనే జలపాతాలూ, స్వార్ధం అనే లోయలూ ఆహ్యానిస్తాయి, వాటి మాయలో పడకు. నమ్మకం అన్నబోర్డ్ దగ్గిర ఆగు. అక్కడే 'కాంతి' అనే ఉద్యానవనం ఉంటుంది. నీకు నీవే గాడ్. గార్డ్....."
 
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!