"ఓ నువ్వు కావాలి"
నా చేయుత కావాలి....
నన్ను నడిపించేందుకు...
నాతో నడిచేందుకు
నా నీడలా అనుక్షణం నాతో ఉండేందుకు..!!
ఓ నవ్వు కావాలి...
నన్ను నవ్వించేందుకు
నాతో నవ్వేందుకు
నా నవ్వుని పంచుకునేందుకు...!!
ఓ నువ్వు కావాలి...
నన్ను నన్నుగా ప్రేమించేందుకు
నా ప్రేమను పంచుకునేందుకు
నా జీవితం నువ్వయ్యేందుకు..!!!