అప్పుడప్పుడు
కొన్ని పదాలు ఎందుకో
నా రూపు దాలుస్తాయి.....
అదో నేనో
ఎవరో ఒకరు ఉండాలని
మొండి పట్టు పడుతుంది...
తను విచ్చిన్నమైన
నన్నువిచ్ఛిన్నం చేస్తూ
యుద్దపు తంత్రులు మ్రోగిస్తుంది...
ఓయ్ ....
గుప్పెడు
మాటల సంగతి
కాస్త చూడకూడదూ
మాటకు మాట అంటూ
అచ్చంగా నీ లాగే
మరీ మొండికేస్తుంది...
(ఇష్టం లేని పదాలు... Afsar గారి కవిత చదివినప్పుడు)