నువ్వు నాతో ఉన్నావో లేదోనన్న
ఆలోచనకు చోటెక్కడ..
నీవెప్పుడూ చిటికెలో వస్తానంటూ
సమయాన్ని భుజానికెత్తుకొని
ఎక్కడెక్కడో పంచిపెడుతుంటావు...
నాకై సమయాన్ని
దాచుకుని వస్తావని ఎదురుచూస్తూ..
నా సమయాన్ని కూడా
పూర్తిగా నీకు అప్పజెప్పి నిలుచుంటాను..
నీకు నాకు మధ్య
తేలని లెక్కల్లో ఇదొకటి...