కోరి పలకరిస్తే అలుసైపోతామా
మాట చెప్పని ఇష్టం
కళ్ళు చెబితే నేరమైపోతుందా
తప్పుకు పోవడం నీకు వచ్చాక
తప్పుకోమని ఆదేశించడం ఎందుకో
ఇష్టానికి అర్దాలు నువ్వు గీసుకొని
గీత అవతల నన్ను ఉండమంటావు ఎందుకో
నీ వంతు కథ చేరుస్తూ...
అలవి గాని గీతలు గీసి
గీతలు చెరపాలని ఆదేశిస్తావ్ ఎందుకో
ఇష్టాలు వదిలేసుకొని వెళ్లిపోవడం
మౌనంగా మాటలు పడడం...
అలవాటు అయినదే కదా...
ముల్లులు ఏరుకొని గుచ్చుకునే విద్య
గుప్తాధిపత్యం నాదే మరి....
అంతా.......
పాత కథనే
అయినా చెప్పిన ప్రతిసారి
కొత్తగా ఉంటుంది...