ఏం చేయను
నువ్వు గుర్తుకొస్తే చాలు
నేను నడిచే దారి మరిచిపోతాను
ఊహప్రపంచం చెల్లా చెదరవుతుంది...
ఎక్కడ మాట కలిపానో
మరింత గుర్తుకు వచ్చి వేధిస్తుంది
నీ రాక తెలియక
కనిపించిన దారులంతా
పూరేకులు పరుస్తాను....
ఎంత కఠినురాలినోయ్
నీ మృదుత్వం ముందు మరేదీ కనిపించదు
తప్పొప్పులు తలంపుకు రానేలేదు
ఓయ్ .... ఈపూట
నా మనసు కాస్త బండ బారిందేమో
లేతపూల రెక్కలు విరిచి
నీ ముందు పరుస్తున్నాను చూడు...