తెలియనితనమో తెంపరితనమో కానీ
నాకు నేను బాగా తెలుసనుకున్నాను
అంతా మరింత బాగా తెలుసనుకున్నాను
ఒక్క క్షణం ఎన్ని నేర్పించి వెళ్ళింది
కరుకైన మాట అలవోకగా అనేస్తారని
తనవారొకవైపు నేనొక వైపు అంటూ గీత గీస్తారని..
.
అర్థమయ్యారు అనుకున్నవారెవరూ
ఇసుమంత కూడా అర్థం కాలేదని...
ఎన్నెన్నో నేర్పించిన ఈ క్షణం
ఎప్పటికీ
ఎదురు పడకుండా ఉంటే ఎంత బాగుండు...
నన్ను నొప్పించిన క్షణం
వద్దనుకున్నా వచ్చి చేరిందంటే
మూసిన కొన్ని కిటికీలను తెరవాలనుకుందేమో
మదికి మరిన్ని కొత్త రంగులు అద్దాలని
నాపై మక్కువతో కంకణం కట్టుకుందేమో..