కుదిరే పని కాదని తెలిసినా
అతని చేతివేళ్ళ మృదుత్వం చూసి
అంచనా వేద్దామనుకున్నా...
అతని మాట పదునైన కరవాలం
అతని నవ్వు మల్లెపూల పూదోట
అయితేనేం
తర్కంతో పని లేకుండా
కాలంతో జతకాకున్నా
అతనో రాజకుమారుడయ్యాడు
ఇప్పుడు
నిక్కచ్చిగా నిజమే చెబుతున్నా
క్రూరంగానో... కుటిలనీతితోనో
మాయతోనో .,. మౌనంతోనో
అతనికై దడికట్టాలని
నాది గాని శాస్త్రాలు నేర్చుకుంటున్న
ఓయ్
యే సమయానికో చిక్కుకున్న నిన్ను
నా సమయానికి జతచేయ
అడుగు అటో ఇటో వేస్తే
తప్పేమీ లేదు కదటోయ్...