నీకోసం
కనిపించినంత మేర వెతుకుతాను...
నిన్ను చూడాలని
బంధించాలని కాదేమో...
నా చెంత ఉన్నావో లేవోనన్న
అనుమానం కూడా కాకపోవచ్చు కదా..
మరి ఎందుకు
వెతుకుతాను పదేపదే....
నిన్ను వెతకడమే ఇష్టమేమో
నీ వెతుకులాటలో
పొరలు పొరలుగా
జ్ఞాపకాల తెరలు
అల్లుకుంటాయని కాబోలు...