ఎందుకో ఈవేళ
మనసుకు కెందుకో పిరికితనం వచ్చింది
నీ నుంచి తప్పిపోతాననే బెరుకుతనం చేరింది..
వీడని మంకుతనం కాస్త ఎక్కువే కదా
మాటైనా చెప్పాక తప్పుకుపోతానేమో...
ఓయ్
నాది కాని ఆలోచన....ఏమిటిది
వర్షపు చినుకల్లే నన్ను అల్లుకొన
సమయం లేదంటూ తప్పుకుపోతున్న
నీ మాటకారితనం కారణం కాదు కదా...
ఏదేమైనా నా నువ్వే కాదటోయ్.....
లాభం లేదు ఇక
కొత్త కథ రాయాల్సిందే
రక్త పిశాచి... రాజకుమారుడు
టైటిల్ బాగుందా....