చల్లని ఓ సాయంకాలం
వెచ్చటి ఊపిరి తాకినట్టు
తేనెరంగు కళ్ళేవో
నన్ను వెతికినట్టు
గుసగుసల మాటలేవో
చెవిన సోకినట్టు...
తెలియని అడుగులు
నను చేరినట్టు...
వివరం తెలియని
నీ ఆచూకీ .... ఏం చేయను
ఓయ్
ఇంకా నా కలలకు
నీ రూపు చిక్కలేదు మరి
పొంతనలేని బొమ్మ గీస్తుంది...