అప్పుడప్పుడు
ఉవ్వెత్తున ఎగిసే ప్రేమను
కాస్తంత దాచుకుందాం
అనిపిస్తుంది రహస్యంగా...
నీ యద అంచున నించొని
తేరిపారా చూస్తున్నా
చిక్కగా అల్లుకున్న
చీకటికోణం ఏమైనా
మిగిలి ఉందేమోనని....
నాది గాని చోటేదైనా ఉంటే
ఉప్పొంగిన ప్రేమను దాద్దామని...
అది కూడా నీకు తెలియకుండా
నా సొంతం చేసుకుందామని..
మరీ ....
ఈ మధ్య పేరాశ కాస్త
ఎక్కువే అయినట్టుంది కదూ...