నీవు మాట్లాడే మాటల్లో ఎపుడైనా
నా పేరు తలుచుకున్నావా
నీవు కమ్మగా నిదురించే వేళ
కలగా ఎప్పుడైనా వచ్చి ఉన్నానా
అటు ఇటు వెళుతూ నా మాట కోసం
ఎన్నడైనా వేచి ఉన్నావా
ఎప్పుడైనా నా నిశ్శబ్దం
నిన్ను కలవర పరిచిందా
అయితే
తప్పక తప్పిదం నాదే
నా ప్రేమతనంలో
కాస్త గాఢత ఎక్కువైందన్నమాట...