నన్ను వేధించు.. విసిగించు
నీ నుంచి తప్పుకోమని వెలివేయి..
అప్పుడు కదా తెలిసేది
నీలో మరింత చిక్కుకుంటానో హత్తుకుంటానో...
ఆనవాలు లేకుండా కనుమరుగవుతానో..
నన్ను నీ వైపు నుంచి
ఒక అడుగు వెనక్కు వేయనివ్వు
నన్ను నేను తెలుసుకోనివ్వు
నీలోని నన్ను ప్రేమించనివ్వు
నా ప్రేమ కొలత అందుకోనివ్వు ...
ఓయ్
నీవు లేని చోట కూడా
నేనల్లుకుపోవాలి
ఎప్పుడు నీకంటూ
ప్రత్యేకమైన చోటు లేకుండా ..
అన్ని వైపులా నేనుగా ..
అప్పుడు అచ్చంగా
నీవు ... నా బందీవే..