ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని
అతనితో మాట కలిపినప్పుడు తెలియదు
అతనిలోని మృదుత్వం చినుకు చినుకుగా
నావైపు జాలువారుతున్నప్పుడు
తేనె చినుకులని మురిసిపోయా...
వారు వీరు కలిసినపుడు
చిక్కటి మెత్తటి నవ్వు ఎక్కడిదోయ్
అని అడిగినప్పుడు కానీ తెలియలేదు
అతని తేనెవిందు ఎంతపని చేసిందో..
ఓయ్
చేసిన సావాసం చాలు కానీ
వంపిన తేనచినుకులు లెక్కతేల్చు
ఇటువైపు వచ్చి
నాలుగు మాటలతో రాద్ధాంతం చేసి
కాస్త పోట్లాడిపోవోయ్ ....
మరీ మరీ చెప్తున్నా
నన్ను నన్నుగా ఉండని....