నా ఊహ ... అతని వాస్తవం
ఒక్కరూపుగా నిలిచింది..
ఇక అతడి కోసం ఎక్కడా వెతకక్కరలేదు
నాకు అతనుండే చోటు తెలిసింది
అతనికై పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు
అతన్ని బంధించే విద్య కొత్తగా నేర్చుకోనక్కర్లేదు
ఇపుడు
అతని సమయానికి
నా ఎదురుచూపుల సమయాన్ని జోడించి
అతని దోసిట్లో పోసాను...
ఏమి చేస్తాడో మరి
అతడికందిన అనంత సమయాన్ని
ఖర్చు చేయడానికి మరింత శ్రమ పడుతూ
ఇపుడో...అపుడో ....ఎక్కడో... ఎప్పుడో తప్పిపోతాడు
అయితేనేం
అతడు ఉండే చోటు పరిచయమైనదే
అతని కోసం వెతకక్కరలేదు
మేఘాలకు ఈవల ఆవల
అనంతంగా అల్లుకున్నది
నేనే కదా.... ఓ ప్రేమే కదా