అతను నిశ్శబ్దంగా ఉంటాడు
వెన్నెల చుక్కలేవో రాలుతాయి
అపుడపుడు చీకట్లోకి నడిచి వెళతాడు
నన్ను ఆ రాతిరి.. మరింత మెత్తగా హత్తుకుంటుంది
నా నుండి దూరంగా వెళుతున్నానంటాడు
నాలో మరింత చిక్కుకుపోయినట్టుగా ఉంటుంది
నేనిపుడు చిక్కని వర్ణచిత్రమై నిలిచిపోయానేమో
అతనిలో నేను కరిగిపోయానో..
నాలో అతని ఇంకిపోయాడో..
తెల్చేదెలా...తేల్చుకునేదెలా