నా సమాధి ఎందుకో బీటలు బారింది
ప్రాణస్నేహితులు చూడ వచ్చారు కాబోలు
తమ ద్వేషాన్ని అందుకొన
నేను లేనని వగచి వగచి....
మందారమాల తెచ్చారు...
పూలెందుకో పదునెక్కాయి
వారిలోని ద్వేషానికి మందారాలు
గొడ్డలై నా సమాధిని చీల్చి వేశాయి
ఏదైతేనేం
ద్వేషంలో ప్రేమ దాగుందని
మరోసారి ప్రాణం తీశారు
ప్రేమతో ప్రాణస్నేహితులు
ఇపుడు
సమాధిలో
స్వేచ్ఛ కరువయ్యింది..
వినిలాకాశం వైపు
ప్రయాణానికి సిద్ధం చేయబడ్డాను..
స్నేహితులు కాదనడానికి
ఇక కారణమేమీ మిగల్లేదు
అవునన్నా కాదన్నా
వారంతా ప్రాణస్నేహితులే .....