గడిచిపోయిన సమయంలో నీవుండిపోయావని
నా ప్రేమముడి ఏదో అక్కడ చిక్కుకుందని..
నేటి సమయాన్ని బంధించి ...
నాటి సమయంగా మార్చాలని
పెడసరపు మది పెంకితనం
ఎక్కువయ్యింది చూడు
నీ గారాబాల మక్కువతో..
ఓయ్
సామరస్యపు మాటతో
మదికి గాలం వేసి
దారికి తెమ్మని చెబితే
మౌనంతో నీవు ... మంకుతో మది
పంతం పట్టడంలో అపర చాణుక్యులయ్యారేంటి
ఇరువురికి నా గడుసుతనం మసకబారినట్టుంది
అనేవాళ్ళు లేక అలకలు ఎక్కువయ్యాయి
మాట సరిపోనట్టుంది ... కర్ర అరువు తెచ్చుకోవాల్సిందే
ఓయ్
ఆ దారి వదిలి
ఈ వైపుకు రావోయ్
చెబితే వినవెందుకు...