రెండక్షరాల్లో ఉన్న మత్తు ఏమిటో..
నీపేరుతో నాకు ముడిబడ్డ గమ్మత్తు ఏమిటో
తలచినంతనే
అణువణువు అల్లుకోవడం ఏమిటో
నీపై అలవి కాని మక్కువ ఏమిటో..
నీవు నా వైపు అడిగేసిన క్షణాన్ని
ఒడిసి పట్టుకొని తూకం వేయాలని ఉంది..
ఓయ్
ఎందుకో ఈవేళ
తరాజు లెక్కలు సరి చూసి
నీకు హద్దు గీయాలి అని ఉందోయ్