అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు చందమామ కథలు కలలుగా అలానే ఉండిపోయాయని.... పగడాల దీవులు .. ముత్యాల నావలు.. వెండి కొండ... శిలలా మారిన నది ఊహకు ఎంత అందంగా కనిపిస్తాయో...
ఈ ఊహల మధ్యనే అతను ఉదయిస్తాడు అందుకే మృదుత్వం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాబోలు... అబద్ధమని మాట వరసకు అనలేను చందమామ కథ మీద ఒట్టేసి చెపుతున్నా...
జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు లేవు ఎన్ని కోపాలు..ద్వేషాలు లేవు.... అయినా ఎక్కడో కనిపించని చోట దాచిన నెమలీకను వెతికి పట్టుకోవడం వచ్చు కదా... జ్ఞాపకాల తెరను అప్పుడప్పుడు కొత్తగా అలంకరించడం తెలుసు కదా....
అన్నిటి మధ్యన నువ్వు చిక్కగా పరుచుకుని నా వెంటే అడుగు వేస్తావు కదా ...ఏమొయ్ నిజమే కదా