ప్రేమను తిరస్కరిస్తున్నానని
బహిరంగ ప్రకటన ఎలా చేస్తావు
మొదటి అడుగు అయినా
వేయలేదని గుర్తించకుండానే
ఒక్క పువ్వు కోరని వారితో
మల్లె తోటలు వేశానంటూ
కినుక ఏల వహిస్తావు
మాటలేవి మదితో కలవకుండానే
కొలతలు ఎలా వేస్తావు
విభజన రేఖలు ఎలా గీస్తావు
అంతా పరిచయస్తులే
కాస్త వెనక ముందుగా స్నేహితులే
మనుషులు మంచివాళ్లేనండి
అప్పుడప్పుడు దారి తప్పుతుంటారు
మనిషిని సరి చేయలేకుంటే
రహదారిని సరి చేసుకుందాం
కొన్ని నిబంధనలు విధిస్తూ