సమాజంలో బతకాలంటే
నాలాంటి వాడికి కష్టం
ముఖానికి ముసుగు వేసుకోవాలి
నాలుగు పదాల్లో జీవితసారం
తేల్చేశాడు ఒక ఆప్త మిత్రుడు..
ఈ సమాజంలో కలిపేద్దామని
ఓ ముసుగు వేద్దామని
పనిగట్టుకుని వెళ్లాను
ఎన్ని వేల ముసుగులు తొలగించాల్సి వచ్చిందో
అయినా అసలు ముఖం జాడ తెలియలేదు
ఇంతకు నా మిత్రుడు
తెలిసి అన్నాడా
తెలియక అన్నాడా
పాపం తెలిసి తెలియక అని ఉంటాడు
ఎంతైనా కాస్తంత అమాయకుడు నా మిత్రుడు