కొండలు కోనలు దాటి
నది ఊరు చేరింది
గట్టుకు ఆ వైపు కొందర్ని
ఈ వైపు కొందర్ని చూసి
కుళ్ళి కుళ్ళి ఏడ్చింది
మనుషులను విడదీశాను అంటూ
ఫక్కున నవ్వి
విడదీయడం...
మనుషుల సొంత విద్య
నీ తరం ఏమవుతుందని
మొట్టికాయ వేసి
మరీ చెప్పాడు
తత్వం తెలిసిన అతను