జ్ఞాపకాల మాల వేసుకుని
జ్ఞానాన్ని ఎక్కడో వదిలేసిన
నన్ను చూసి
నా మది బుద్ధి లేదంటూ
మొట్టికాయ వేసింది..
దానిదంతా అదో తరహానే
అల్లిబిల్లిగా నీ చుట్టూ తిరుగుతుంటే
వలదు రా రమ్మని పిలుస్తుంది
నిన్ను కాదని తప్పుకు పోతుంటే
చెవిమెలేసి లాక్కు వస్తుంది
అది చెప్పినట్టు
దాని అదుపాజ్ఞాలో ఉంటే
అమ్మలా బుజ్జగిస్తుంది
కాదంటే
జమిందారి పెత్తనం చూపిస్తుంది
చివరాఖరుకు
నువ్వు నేను సరి జోడి అంటూనే
నమ్మకు మరీ అంతగా అంటూ
ఎద్దేవ చేస్తుంది చూడు..
నీ అనురాగపు లోగిలిలో
అల్లరి నేర్చిన మది
దారి తప్పినట్టుంది ..
ఒక్కసారి తీసుకెళ్లి
బుద్ధి చెప్పి పంపవు