పొద్దు పొద్దున్నే తోవలో
ముత్యమల్లే
మనుషులు కనిపించారు
అందులోని
జంతు ప్రేమికులు
రోడ్డును ఖరాబు చేస్తుండ్రు
వృక్ష ప్రేమికులు
పూలను రాల్చి వెల్తుండ్రు
ఏమి చేయాలి
ముత్యమంటి మనుషులను
దగ్గరగా చూడగానే
నా ముఖం ముడుసుకు పోయింది
లాఠీ ఉన్న పోలీసైతే బాగుండు
నాలుగు తగిలించి పోయేదాన్ని
Text