అతను ఈ వైపు వచ్చాడన్న
ఆనవాలు అందగానే..
అతని మదికి మాలిమైనా
నీకు ఇంకా అక్కడ చోటు సిద్ధం
చేయబడలేదని ఎంతో నచ్చచెప్పాను
అయినా
నీవి అన్నీ అబద్ధపు అపవాదులే
అతడు బెంగటిల్లి ఉంటాడు
అన్నపానీయాలైనా అందుకున్నాడో లేడో అంటూ
మనసు పరుగులు పెడుతుంది ఆ వైపుకి
అంచనాలన్నీ తారుమారు చేస్తూ హద్దులు చెరిపేస్తూ
ఏమి చేయను
రాలిపోయిన చిగురులాంటి మోముని
చంద్రబింబం అంటుంది
వెళ్లడానికి మోరాయించే కాళ్ళను
రంగుల రెక్కలుగా మారాయంటుంది..
అతని వైపుకు వెళ్లడానికి నాతో ఏమైనా అంటుంది
ఓయ్ గమనించావా..
నా మది కర్కసత్వాన్ని అందుకుంది
నా మాట కఠినత్వం తెచ్చుకుంది
బంగారం లాంటి నన్ను బందీని చేసావు
మృదువైనవాడు అంటూ పరుగులు పెట్టించావు
నిజం చెప్పు
ఇంతటి మృదుత్వం నీకెక్కడిదోయ్