యుద్ధం వచ్చి వెళ్లినట్టుంది...
కాలం కరిగిపోయి మసకబారుతుంది
నువ్వు నేను మనమన్న పూలచెండు
దారపు పోగు ఎక్కడో పల్చబడింది
నా చేతులు ఎంత బారుగా చాచిన
సాగిన నా చేతులు
ఖాళీగా చిక్కు పడిపోతున్నాయి
ఒకానొక చోట
మాటల కుప్పపోగుబడింది
అది కుళ్ళి మట్టిలో కలిసిపోయేలోగా
మట్టిలో ఇంకా కలవని మనం
కాస్త మాట్లాడుకుందాం రారాదు