నేను వెళ్లేసరికి ఎదురుపడిన
ఖాళీ కాఫీ కప్పు
వెక్కిరిస్తూ కనిపించింది
అతను వచ్చి వెళ్ళాడు కాబోలు..
అతను వేచి ఉండి వెళ్ళాడో
వేగిరిపడి వెళ్ళిపోయాడో
తేల్చుకునేది ఎలా.....
ఇప్పటికి .. అక్కడ
ఖాళీ చేయబడిన కాఫీ
అడుగంచున....
వదిలివెళ్ళిన ఎదురుచూపు
నువ్వే కదూ...❤️