రెండు కప్పుల కాఫీ
తయారు చేయబడుతుంది
ఒక కప్పు కాఫీ
అందుకున్నప్పుడల్లా
రెండోది నీకోసం అందిస్తే
బాగుంటుందనుకుంటాను
అందుకున్న కాఫీ
నాలో జాలువారుతు
కప్పును ఖాళీ చేస్తుంది..
అయినా .. తనివి తీరక
నాలో నింపుకోవడానికి
నిండుగా ఉన్న కాఫీ కోసం
చేయి చాస్తాను......