బలంగా నా వైపు ఒక రాయి విసిరి
నీ మంచి కోసమే అని చెప్పే
మహా మనుషులు ...
దెబ్బ తగిలిన మనసు తల్లిడిల్లి
మౌనంగా తనలో తను...
తనతో తాను యుద్ధం చేసి
గెలిచిన సమయాన....
నీ గెలుపుకు కారణం నేనేనంటూ
మరో రాయి విసరడానికి
సిద్ధంగా ఉండే మహా మనుషులు..
ఏమైనా కానీ
మనపై రాయి విసిరేస్తూ చెప్పుకోడానికి
ఓ అందమైన కారణం ఉండే ఉంటుంది
మనల్ని తప్పుకు పోయినవాళ్ళు మరెవరికో
శ్రేయోభిలాషులు అయ్యే ఉంటారు....
ఏదైతేనేం...
రాయి విసిరే వారు
గాయం తుడిచేవారు
అంతా ఒకే గుంపు...
తప్పుకొని ఎలా పోను....
మనుషులు ..మాటలు ఇష్టం
సమయమే ఎప్పటికీ రారాజు ...
మనతో లేనివారు మహాత్ములే
మనతో ఉన్నవారు మహనీయులే
ఏదేమైనా అంతా మనవాళ్ళే కదా