ఊరినిండా మనుషులు
పాత విసుగులు .. కొత్త పలకరింపులు
ఎంత మాట్లాడినా తరగడం లేదు
ఇంతమంది మాట్లాడే మనుషుల మధ్య
అద్భుతమైన నగిషీ చెక్కిన మనుషులు
కొందరు ఎదురు పడుతూనే ఉంటారు
చేయి కలిపి మాట్లాడాలని మదినిండా ఊహలు
దోబూచులాడే బాల్యపు చిహ్నాలు
తన నుండి విడిపడకుండా అపురూపంగా
హత్తుకున్న మృదువైన వారు..
అయినా ఎందుకో
వారు గుర్తించలేని
పెద్దరికపు జరీ అంచులు
దూరంగా నిలబెట్టేస్తాయి..
ఎదురుపడినా పలకరించకుండా
చూసి చూడనట్టు తప్పుకు పోతున్నా
నేను నొచ్చుకుంటూ ..వారిని నొప్పిస్తూ
ఎలా తెలిపేది
ఎప్పటికి తెలిపేది
మీరు ఎంతటి అపురూపమని
ఎదుటపడి ఎపుడు చెప్పేది....