అప్పుడప్పుడు ..
సందడి చేసే పదాలు
మగతగా నిదురపోతాయి
అప్పుడప్పుడు..
నాలో నేను పదే పదే
ప్రవాహపు ఆలోచనలు మధ్య
చిక్కుకుంటూ ... మదిని నిలువరిస్తా
నీ వైపు అడుగు పడకుండా....
అప్పుడప్పుడు..
తూకాలు .. కొలతలు ..సరిహద్దులు
అంటూ ఎన్నో ఎన్నెన్నో మొండిగా
నాకు నేనుగా అలివికాని హద్దులు గీసుకుని
మది నీ వైపు తూలకుండా అడ్డుగోడలు కడతా
అయినా
మాటమీద నిలకడ లేని మనిషినై
పిల్లకాలువలా నిశ్శబ్దంగా నీ వైపు
అడుగులు వేస్తూనే ఉన్నా ..
నాకు నేను దూరం అవుతూ....
నాలోని కొంత నీవంటూ