మనసు పొరలు పొరలుగా విడిపోయి
నడిరోడ్డుపై నుంచుని నేనెప్పుడో మరణించానంటూ
పదే పదే ఎలుగెత్తి చాటిచెబుతుంది..
మనసుకు ఎంత మొండితనమో
మనసు వాదనలొకతీరు .. లోకమంతా మరోవైపు
స్నేహితులు బంధువులు లేరంటుంది
తనకు తాను మాత్రమే మిగిలానంటుంది
చీకటి గదిలో బందీనంటుంది...
అంతలోనే
చిన్ని నవ్వుకు... గోరంత వెలుగుకు మురిసి
తాను చెప్పిన వన్నీ ఎక్కడో కొండగాలులకు వదిలేసి
రామచిలుక పలుకులు...జలపాత హోరును ఒడిసిపడుతూ..
లోకం అంతా నాదే అంటూ... కనిపించని నిన్ను
ఆకాశం అంతా ప్రేమిస్తున్నా అంటూ నీ చుట్టూ అల్లుకుపోతుంది..
ఎన్ని వేలసార్లు నా మది
ఇదే మాటల బాటలో నడిచిందో
అయినా ..ఎప్పుడూ
నా పెంకిమనసు అపురూపమేనోయి ..
ఏదిఏమైనా ముగింపు నీవే కనుక...❤️