వెనుదిరిగి ఎన్నిసార్లు చూశానో నీకోసం
చూసిన ప్రతిసారి నీ ఆనవాలు
కనపడలేదు అనంత దూరం వరకు.
నీవు ఆ దారిన నడిచి వెళ్ళావని తెలుసు
నేను వచ్చిన వేళ మించిపోయిందేమో
ఆనవాళ్ల జాడ కనుమరుగైపోయిందేమో..
వేల విద్యలు నేర్చుకున్న నీకు
నా గడసరి విద్య అంతుపట్టదు కదా
చెరిగిన ఆనవాళ్లకు రంగులు వేసే
టక్కు టమారి గారడివిద్యకు
అధినేతను నేనే కదా..
అయినా
వాదనలు ఎందుకోయ్
నిజనిరూపణలు ఏలనోయ్
నికార్సయిన నిజానికి...
నీ అరచేయి గీతల మధ్య చిక్కుకున్న
పుట్టుమచ్చ సాక్షిగా చెబుతున్నా
గత ఏడు జన్మలుగా నీ వెంట
నీడగా ఉన్నది నేనే నని
నీ 'నేను 'అని....