నేనేమీ నీ అనుమతి కోరలేదు
నిన్ను ఇటువైపు రమ్మని అడగలేదు
నీ రూపు నా కలలోకి రాకుండా కట్టడి చేసుకో
నీ మృదుత్వం నా వైపు వెదజల్లబడకుండా కంచె కట్టుకో
నన్ను నాకు నచ్చినంతగా నిన్ను ప్రేమించుకోనివ్వు
నువ్వు చెప్పిందే నేను చెపుతానంటూ
నాతో వాదులాట మొదలెట్టకు
నాకు తెలిసిన గారడి విద్య
నీకు రాదని గుర్తుపెట్టుకో .....
కాదు కూడదని నాతో కయ్య మాడాలంటే
ముక్కు మూసుకొని తపస్సు చేసుకో
అప్సరసలు వచ్చి నీకు ఎదురుపడితే
చూసి అసూయపడాలని ఆశపడు...