నాలాంటి మరొకరు నాకై
ఉంటే ఎంత బాగుండు...
నా కోపానికి ఎదురొడ్డి నిలిచేవాళ్లు
నా మౌనాన్ని ఛేదించే వాళ్ళు
నా చిరాకుని ఒడిసి పట్టేవాళ్ళు
నాలాంటి మరొకరు నాకై
ఉంటే ఎంత బాగుండు...
మాటల కోసం మనిషికై వెతికే వేళ
చెదిరిన జ్ఞాపకాలు నక్షత్రాల్లో దాచేవేళ
చెదిరిన బంధాలను ముడి వేసేవేళ
నాలాంటి మరొకరు నాకై
ఉంటే ఎంత బాగుండు..