నిశీధి నిదురలో... వెన్నెల వెలుగుల్లో
కొండ కోనల్లో .. సముద్రపు అంచుల్లో ..
అంతుతెలియని చిట్టడవిలో ..ఎక్కడెక్కడో
సమయా సమయాలు కానక
పూలలోని మకరందం వోలే
అక్షరాలను వెతికి తెచ్చుకున్నాడు...
వేల వేల అక్షరాలను కుప్పగా పోసి ..
కరకు పదాలు కొన్ని.. కనువిందైన పదాలు కొన్ని
మనసైన మాటలు కొన్ని.. మనస్సాక్షి కోసం కొన్ని
అన్నిటికీ మధురిమలు అద్దుతూ
చక్కనైన పూలమాలను అల్లుతున్నాడుగా అతను..
పలకరింపు కోసం వెళ్లి.. మనసాగక
పిడికెడు అక్షరాలు దొంగిలించుకొచ్చుకున్నాను
అందుకే అప్పుడప్పుడు నా మాటలకు
కాస్తంత మధురిమలు ఎక్కువ కాబోలు..