ఎన్నెన్ని అడుగులు
ఎన్నెన్నో దారులు
కంటి ముందర
కల్లోల పరుస్తూ...
నువ్వు ఎవరన్న ఊహ
నాకేం అవుతావని ఆలోచన
నువ్వే ఎందుకన్న ఆరాటం
వేలవేల ప్రశ్నార్థకాలు..
జవాబు ఆశించని ప్రశ్నలే
ఓయ్
నా మనసు ఎంత అల్లరిదో, కాసింత మొండిది కూడా..
ప్రశ్నలు ఆలోచనలు నీ వైపుకు తోసేసి....
నాలోని కొంత నీనంటూ
నీలోని " నువ్వు ' నేనంటూ
కొత్త తర్కానికి తెరతీస్తూ ..
ఏదైతే నాకెందుకు
సందేహనివృత్తి.....
సంశయ లెక్కలు తూకాలు
నీవు చూసుకో... అంటూ
నేను మాత్రం
నిన్ను ఆకాశమంత ప్రేమిస్తూ
సముద్రపు అంచుల్లో నీ చిత్రాన్ని గీస్తూ
మరో ఏడు జన్మలు గడిపేస్తానిలా...
నీ అంచనాకు అంతు పట్టని జవాబులా...
అంటూ సరికొత్త భాష్యం చెబుతోంది చూడు❤️