మీ ఊరు వెళ్ళిపోరాదు....
నాకు గుర్తున్న పేరు చెప్తే
అమ్మమ్మ ఊరు అనిరి
ఇంకో పేరు చెప్తే
మీ అమ్మొల్ల ఊరు కాదే
అని కిసుక్కున నవ్విరి
ఇంకోటి అత్తోల్ల ఊరాయే
ఇప్పుడు ఉన్నది పిల్లల ఊరాయే
ఇంతకు ,.
నా ఊరు ఏదో... ఏడనో
యాదికొస్తలేదు..