అతనన్నాడు గుర్తొచ్చావని
నేను మాటలు పొడిగించలేదు
గుర్తు రావడానికి కారణాలు ఎన్నో...
గుర్తులు చెరిగిపోవడమే.
విడిపోవడానికి కారణమైతే
అయినా విడిపోయి
గుర్తుకు మెరుగు పెడుతూనే ఉంటారెందుకో
మనిషికి మనసుకు సయోధ్య కుదరదందుకే....
మనసు ఒడిపోతూ....మనిషి గెలుస్తూ
తూకం సరిపోవడం లేదు ఎందుకో....