వంట ఇంట్లో గిన్నెల చప్పుడు
గుప్పున కాఫీ వాసన వస్తే
అమ్మ పట్టు చీర కట్టుకున్న అంత
అందంగా యాదికి వస్తది
బడి నుంచి ఇంటికి వస్తే
బోసిపోయిన ఇల్లు చూసి..
ఇల్లిల్లు అమ్మ కోసం వెతుకుతుంటే
అమ్మ మాట విన వచ్చిన కాడ
తడి చీర అద్దుకున్నట్టు సల్లగా ఉంటది
ఇప్పుడెందుకో మల్ల
యాది వస్తలేదు
ఏ గాయం మనసుని గిల్లిందో
ఎట్లయిన..
యాది చేసుకుందామనుకున్నా
యాది రానంతగా మనసు
బండబారే....
పురుగులు పట్టి
పుచ్చి పోయిందేమో మరి...