నీకోసం వెతుకుతాను నదీ తీరం వెంట,
పచ్చికబయల్లో, ఎత్తైన శిఖరంలో
వెతుకుతున్న ప్రతిసారి
దూరంగా నీడలా వెళుతూ నీవు..
అయినా..విచిత్రమే
ప్రకృతి.. పురుషుడెప్పుడయ్యాడో!
అలసి సొలసి సముద్రపు తీరంలో కూర్చున్నప్పుడు
అలలా వచ్చి చిన్నగా ముద్దాడి వెళతావు..
నేను కన్నెత్తి చూడనపుడు
ఆకయితనంగా తడిపేసి వెళతావు..
అవునోయ్ ..ఆ క్షణం తెలిసింది
ముందు వెళ్లే నీడ నీదే
నా వెనక నడిచే నీడ నీదని..
నేను రెండుగా విడిపోయాను
నిను అన్వేషిస్తూ .. నిను అల్లుకుపోతూ
అదేమిటో ...
ఏక మొత్తంగా నేను
విడిపోతూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ