తెల్లవారితే చాలు
అతని గదిలోని నిశ్శబ్దపు పరదానై
మడత పెట్టని దుప్పటినై ..
అతని చెంతనే ఒదగాలని
మతి లేని మది
మంకుపట్టు పడుతుంది
కానీ.. అతనో
మృదుత్వపు రాగరంజిత
సముద్రుడు కదా
అలలు అలలుగా ఎగసి
తాకి తాగకుండా ఒకసారి...
నిలువెళ్ళా తడిపేస్తూ మరోసారి..
ఆటలాడే అతన్ని
ఒడిసి పట్టుడం నా తరమా
అయినా
ఎందుకో పదే పదే
అతని వైపే అడుగులు పడతాయి...