ఎందుకోయ్ ..
ఆకతాయి పనులు చేశానని
హద్దు తెలియదంటూ
అపుడపుడు మౌనంతో గీతలు గీసి..
నా దారి నుంచి తప్పుకుంటావు
అయినా నాకు తెలుసు
నీ మదిలో కాస్త చోటు నాది కూడా
నీ ఆలోచనల్లో కొంచెం నేను కూడా
అయినప్పటికీ....
నీ జ్ఞాపకపు
మడతల్లో నేనున్నానని....
నీలో సగం నేనేనని
దావా వేయను కదా..
అయినా ఎపుడో
ఓ సగం పంచబడింది
మరో సగం అచ్చంగా
నీదిగా మిగిలిన నాదే...
చోటు కోరని నన్ను
కాదని తప్పుకోవడం
తప్పుకదా....!!
అయినా కానీ
తప్పకపోయినా... తప్పుకోను
తప్పో..ఒప్పో
నిను జ్ఞాపకాల్లో బంధించే
విద్యలో..
గోల్డ్ మెడల్ నాదేనోయ్...