నేను రాకపూర్వమే గీసిన వర్ణ చిత్రాన్ని
చూపించి ఇది నీవన్నాడు.....
వర్ణాలు అందరివి కానీ అక్కడ నేను లేనన్నాను..
ఈ వైపుకు వచ్చి చూడు అచ్చంగా నీవేనన్నాడు
అప్పుడు కూడా నా పెదవిపై చిరునవ్వు నేను కాదన్నది
ఓమారు చూడు ప్రేమింపబడడం అపురూపం అన్నాడు
నా ఎన్నో ఇష్టాలను బంధించే ప్రేమ నాది కాదన్నాను.
వర్షపు చినుకులు లాంటి ప్రేమ అమృతమే నన్నాడు
చినుకు చినుకు పెనవేసుకున్న నదికి అడ్డయ్యిందన్నాను..
అది రణము కాదు ...
ఎందుకో రాజీ లేదు....
నేను లేని నువ్వు ఎక్కడ అన్నాడు..
నాలోని నువ్వు నేనే కదా.. ఓ మౌనసమాధానం
అతని వరకు అందించకుండానే వెనుదిరిగాను