వేళ కానీ వేళ అసత్యం మాడని సన్యాసి ఒకడు
నిధి ప్రాప్తి ఉందని చిలక జోస్యం చెప్పాడు
అందుకే కాబోలు..
ఆకాశపు మబ్బులు వచ్చి కలసివెళ్లాయి...
సముద్రపు అల్చిప్పలు పలకరించాయి..
వర్షపు చినుకు ముద్దాడివెల్లింది
ఎంతటి అద్భుత నిధులో
కలలా...కలవరించి...
పరవశించి.. మురిసిపోయా..
అంతలో
నిదుర లేచిన జోలపాటలా నువ్వొచ్చావు
అద్భుతాలపై మంచుతెర వేయబడింది
మనసాగక అడిగాను మరొకమారు
నిక్కముగా అనంత నిధివి నీవేనా
పాతకథలోని మంచుముక్క నీవే కదా ...
నా ప్రశ్న
నీ మౌనంలో
ఒదిగిపోయింది
ఓ ప్రశ్నగా...
ఓయ్ ...ఏదైనా కానీ
మనసు నిలవరిస్తానో....
మదన పడతానో..
నేను సత్యమనుకున్నా వేళ..
నీ జలతారు మోహానికి
కోరి చిక్కుకోనా.....
ఎప్పటికయినా...
నీకు అంకిత మిచ్చేయనా
నిదుర లేని రేయిని
నా సంతకం చేసి ..