అతడు ఎక్కడ ఉంటేనేం
అతడు అడుగుల ఆనవాలు
నా మదికి తెలిసినంతవరకు..
అప్పుడప్పుడు
ఏ రాచకార్యాల్లో ఉంటాడో
ఆచూకి వదలకుండా
మబ్బుల చాటుకు
చేరిన చందమామలా
తప్పుకు పోతాడు..
మరిఇక...
ఆనాడంతా మదికి ఉపవాసమే
తనువు సంగతి మరి అడగొద్దు..
అయితేనేం
అతని ఆనవాలు చిక్కిచిక్కక ముందే
రాలుగాయి మనసు తటిల్లున చేరిపోతుంది
మనసుకి వరమాల వేద్దామని ఆశ కాబోలు
ఇంతకీ ...అతను
నా జ్ఞాపకపు అరలో
దాచిన నెమలీకే కదా...