చెదిరిన ఆకాశం
ముక్కలు ముక్కలుగా విరిగింది
అన్నిటిలో నేనే..
అందులో కొన్ని ముక్కలు
అతని సొంతం అయ్యాయి..
మిగిలిన ముక్కలు
అతనితో యుద్దానికి దిగాయి
యుద్ధం ఎవరితో
అతనిలోని .. నేనా..
నాతో..నేనా..
గెలుపు లేని యుద్దమా
గెలవలేని యుద్దమా
సందిలేని యుద్ధమా
ఓడాల్సిన యిద్దమా..
ఇతమిద్దంగా తేలని సమయాన
అతనన్నాడు..
నేను ఏక మొత్తంగా
విరిగి రాలిన రవ్వలో
ఒదిగిపోయా..
నేను లేను.. అంతా నువ్వే
నీలోని నువ్వే... నేనన్నాడు
యుద్ధం.. కన్నీరై
కరిగి.. కరిగి
సంద్రమయింది..